ప్రణాళిక పనులకు నోచుకోని భాగ్యనగర్ తండా

561చూసినవారు
ప్రణాళిక పనులకు నోచుకోని భాగ్యనగర్ తండా
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం భాగ్యనగర్ తండా గ్రామ పంచాయతీ నందు 1వ వార్డు, డిబి సెంటర్ లో అంతర్గత రోడ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 30 రోజుల ప్రణాళిక పనులల్లో పలుమార్లు విన్నవించుకున్న స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని తండా వాసులు వాపోతున్నారు. 30 రోజుల ప్రణాళిక పనులు 60 రోజులకు పొడిగించిన నిరుపయోగంగా మారిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కనీసం వీధుల్లో బ్లీచింగ్ చల్లే పరిస్థితి కూడా లేదని, వర్షాకాలం కావడంతో వీధుల్లో గుంటలు ఏర్పడి దోమలు వ్యాపిస్తాయని, తద్వారా విషజ్వరాలు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ పట్టించుకోని అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం వంటివి చేపట్టి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్