ఈనెల 16న దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో సిఐటియు రాష్ట్ర నాయకులు యర్రా శ్రీకాంత్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు బంద్ నిర్వహిస్తున్నామని, సమ్మెలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.