ఖమ్మం నియోజకవర్గ కోఆర్డినేటర్ గా మహ్మద్ జావీద్

52చూసినవారు
ఖమ్మం నియోజకవర్గ కోఆర్డినేటర్ గా మహ్మద్ జావీద్
ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో కోఆర్డినేటర్లను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులను నియమించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు నాయకులు కేటాయించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామసమాయం రఘురాంరెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా మహ్మద్ జావీద్ ను నియమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్