ఎర్రుపాలెం: పత్తి తూకంలో మోసం

78చూసినవారు
ఎర్రుపాలెం మండల కేంద్రంలో మంగళవారం పత్తి కొనుగోలులో ఘరానా మోసం జరిగినట్లు బాధిత రైతులు చెప్పారు. వైరా నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు రిమోట్ ద్వారా తూకాన్ని మార్చి 100కేజీలు ఉన్న పత్తిని 60 కేజీలు మాత్రమే చూపించారన్నారు. ఈ మోసాన్ని గుర్తించిన రైతులు వారిపై వాగ్వాదానికి దిగారు. ఆరుగాలం పంటలు పండించిన రైతులను మోసం చేస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్