మస్తాన్ అనే పాల్వంచ పట్టణానికి చెందిన వ్యక్తి మధిరలో డ్రైవర్ వృత్తి కొనసాగిస్తుండగా బుధవారం వైయస్సార్ సర్కిల్ వద్ద ఫిట్స్, స్ట్రోక్ వచ్చి కింద పడిపోగా స్థానికులు ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం వారికి తెలియజేశారు. వెంటనే స్పందించిన దోర్నాల రామకృష్ణ పుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఖమ్మం తరలించారు.