ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలో సబ్ కోర్టు, సివిల్ కోర్టు నూతన భవనాల నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి శనివారం మధిర కు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తులు సుధా, శరత్, నరేష్ లకు మధిర మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన భవనాలకు భూమి పూజ, శంకుస్థాపన చేశారు.