మధిర సేవా సమితి సేవలు అభినందనీయం

70చూసినవారు
దాతల సహకారంతో మధిర సేవా సమితి అధ్యక్షులు పల్లబోతుల ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆదివారం మధిర పట్టణంలోని అభిరామ్ టవర్స్ నందు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఐఎన్టియుసి మండల అధ్యక్షులు కొమరంపల్లి చంటి మాట్లాడుతూ. మధిర సేవా సమితి చేస్తున్న కృషి ఎంతో గొప్పదని, మునుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని పల్లబోతు ప్రసాద్ ను అభినందించారు. ఆళ్ల కృష్ణ, రూప, రాము, మురళీకృష్ణ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్