రుణమాఫీ కానీ రైతులకు వ్యవసాయ శాఖ అధికారుల సర్వే
బోనకల్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాల్లో రేషన్ కార్డు లేని రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి కొండూరి విజయ భాస్కర్ రెడ్డి చేపట్టారు. బుధవారం ఆయా గ్రామాల్లో సర్వే నిర్వహించారు. మధిర సహాయ వ్యవసాయ సంచాలకుడు స్వర్ణ విజయచందర్ మాట్లాడుతూ. రేషన్ కార్డు లేని రైతులు ఆయా గ్రామాల్లో నిర్వహించే సదస్సుల్లో పాల్గొని సరైన పత్రాలు సమర్పించాలని అన్నారు.