మధిరలో ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గత రెండు నెలలుగా వేసవి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం చల్లబడటంతో ఒక్కసారిగా ఉపశమనం దొరికినట్లు అయింది.