నేలకొండపల్లి: 29 కల్లా సభ్యత్వాలు పూర్తి చేయండి
బీజెపీ సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని ఈ నెల 29 లోగా పూర్తి చేయాలని బీజేపీ సభ్యత్వ జిల్లా ఇన్చార్జ్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించారు. గురువారం నేలకొండపల్లి మండలంలోని కొత్త కొత్తూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదులో మండలాన్ని జిల్లాలోనే ఆదర్శంగా నిలపాలన్నారు. ఈ సమావేశంలో పాలేరు కన్వీనర్ మేకా సంతోష్ రెడ్డి, మన్నె కృష్ణారావు, మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.