మధిర మండలంలోని పలు గ్రామాల్లోని పంట పొలాల్లో సోమవారం విద్యుత్ శాఖ వైరా డివిజన్ డి. ఈ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పంట పొలాలకు వినియోగించే విద్యుత్ మోటార్లకు కెపాసిటర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని దీనివలన విద్యుత్ ట్రాన్స్ ఫారములు తరచూ అంతరాయాలకు గురి కాకుండా నాణ్యమైన విద్యుత్తు పొందవచ్చునని తెలిపారు.