కుల నిర్మూలన కోసం ఉద్యమాలు

57చూసినవారు
కుల నిర్మూలన కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కే. నాగేశ్వరరావు సూచించారు. ఆదివారం నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన కుల నిర్మూలన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో కుల నిర్మూలన కోసం ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. దళితులకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్