బోదులబండలో ఘనంగా గంగమ్మ తల్లి జాతర

69చూసినవారు
నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గంగమ్మతల్లి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యాదవ సోదరులు కుల ఆచారం ప్రకారం గజ్జల లాగులతో, డప్పు వాయిస్తూ సందడి చేశారు. అనంతరం మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్