కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలుయ్యేంత వరకు పోరాడుదామని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు గుర్రం అచ్చయ్య డిమాండ్ పిలుపునిచ్చారు. ఆదివారం తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో జరిగిన జనరల్ బాడి సమావేశంలో మాట్లాడారు. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు రూ. 12 వేలు జీవనభృతి వెంటనే అమలు చేయాలని, రైతాంగ రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు.