గిన్నిస్ బుక్లో చిరంజీవి పేరు.. పురస్కారం అందజేసిన అమీర్ ఖాన్
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్సులో ఆయన పేరు ఎక్కింది. 150కి పైగా సినిమాల్లో అత్యధిక డ్యాన్స్ స్టెప్పులతో అలరించినందుకు ఆయనను ఈ పురస్కారం వరించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ప్రతినిధుల బృందం పేర్కొంది. ఈ పురస్కారాన్ని బాలివుడ్ స్టార్ అమీర్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు.