పెనుబల్లి: ఆర్అండ్ బి కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

61చూసినవారు
పెనుబల్లి మండలం వీఎం బంజర్ గ్రామంలో ఉన్న ఆర్ అండ్ బి కార్యాలయాన్ని శనివారం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆఫీస్ లో ఉద్యోగుల వివరాలు, రోజు వారి హాజరు రికార్డ్స్ లను పరిశీలించారు. కాగా, కార్యాలయంలో నమోదైన హాజరుపై అసహనం వ్యక్తం చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. విధుల్లో అలసత్వం వహిస్తే సహించేదిలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్