కందుకూరు దళితవాడలో కూలిన పూరిల్లు

1061చూసినవారు
కందుకూరు దళితవాడలో కూలిన పూరిల్లు
గత మంగళవారం నుండి కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు దళితవాడకలో నివసిస్తున్న కొరకొప్పుల నాగేంద్రబాబు పూరిల్లు వర్షాలకు నేటి మధ్యాహ్నం కుప్పకూలిపోయింది.ఇంట్లో ఉన్న ఇనుపబీరువ తో పాటు కొన్ని సామానులు ధ్వంసమయ్యాయిని యజమాని తెలియజేశాడు.
తన భార్య ఇద్దరు కుమార్తెలు తో కలిసి తన ఇంటిలో నివసిస్తున్న నాగేంద్రబాబు శనివారం ఉదయం ఇంటి పరిస్థితిని ముందుగా పసిగట్టి పిల్లలతో పాటు ఇల్లు ఖాళీ చేసి వేరే చోట తలదాసుకున్నాడు.ఒకవేళ రాత్రి పూట నిద్రసమయంలో ఇల్లుకూలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని భార్యాభర్తలు వాపోయారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి కాలనీ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్