సత్తుపల్లి: విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని వడ్డించాలి

84చూసినవారు
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ఆహారాన్ని ప్రతిరోజు వడ్డించాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సూచించారు. సత్తుపల్లి యుపీఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని సోమవారం పరిశీలించారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని చెప్పారు. అలాగే, ప్రీ ప్రైమరీ క్లాస్ ను ప్రారంభించారు. అనంతరం చిన్నారులతో స్వయంగా పలకపై అక్షరాలు రాయించారు. అంగన్వాడీ స్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్