ఖమ్మం జిల్లా వక్ఫ్ బోర్డు ఆస్తులను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దోచుకునేందుకే వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తుంది అని సత్తుపల్లి మక్కా మసీదు మాజీ అధ్యక్షుడు, మైనారిటీ నేత మహ్మద్ అఫ్జల్ శనివారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తికి, మత స్వేచ్చకు విఘాతం కలిగించేలా వక్ఫ్ చట్టంలో సవరణలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకుని వచ్చిందని ఆయన విమర్శించారు.