డివైడర్ ను ఢీకొట్టిన లారీ

62చూసినవారు
లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న ఘటన గురువారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి అశ్వరావుపేట వైపు వెళ్తున్న లారీ పట్టణంలోని రిలయన్స్ ట్రెండ్స్ సమీపంలోకి రాగానే యూటర్న్ వద్ద కారును తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఎవరికి గాయపడలేదు. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను క్రమబద్ధీకరించారు.

సంబంధిత పోస్ట్