తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో పాల్గొన్నారు. పాఠశాలలో జరుగుతున్న అంశాలను తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం టాయిలెట్స్, వంటగది, ఆర్ఓ ప్లాంట్ గది, కిచెన్, గార్డెన్లను పరిశీలించారు.