విశ్వనాథపల్లి లో విజయవంతమైన వైద్య శిబిరం

58చూసినవారు
విశ్వనాథపల్లి లో విజయవంతమైన వైద్య శిబిరం
కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామంలో మంగళవారం కారేపల్లి మండల వైద్యాధికారి సురేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి విచ్చేసిన గ్రామస్తులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ప్రజలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్