కారేపల్లి మండలంలో వడగండ్ల బీభత్సం

53చూసినవారు
కారేపల్లి మండలంలో వడగండ్ల బీభత్సం
కారేపల్లి మండలంలో ఆదివారం వడగండ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్లవాన పడింది. రోడ్ల మీద వడగండ్ల రాళ్లు పడుతుండటంతో వాహనాలను పక్కకు నిలిపివేశారు. రేగులగూడెం సమీపంలో గ్రామానికి, వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా అయ్యే విద్యుత్ స్తంభాలు గాలికి నేలకూలాయి. రోడ్డు పక్కన విద్యుత్ స్తంభం పడిపోవటంతో రోడ్డుపై విద్యుత్ వైర్లు పడి పోయయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్