యువత జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్ ను ప్రభుత్వాలు తక్షణమే నిషేధించాలని పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్పీ రాకేష్ డిమాండ్ చేశారు. ఆదివారం కారేపల్లి మండల కేంద్రంలో బెట్టింగ్స్ యాప్స్ వల్ల జరిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్లను ప్రమోట్ చేసే వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.