కారేపల్లి: కుటుంబాల గుర్తింపునకు స్టికరింగ్‌

51చూసినవారు
కారేపల్లి: కుటుంబాల గుర్తింపునకు స్టికరింగ్‌
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో భాగంగా కుటుంబాల గుర్తింపునకు ఇంటింటికి స్టికరింగ్‌ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. కారేపల్లిలో స్టిక్కరింగ్‌ కార్యక్రమాన్ని ఎంపీడీవో జీ. సురేందర్‌ సోమవారం పర్యవేక్షించారు. కుటుంబాల గుర్తింపును ఎలాంటి తప్పులు లేకుండా గుర్తించి స్టికర్లు వేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్‌ జాకీర్‌ బాబా, పంచాయతీ కార్యదర్శి ఎస్‌ నవీన్‌, విజయ్‌,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్