దొంగకు దేహశుద్ది చేసిన స్థానికులు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి ఆరు పంపుల కూడలిలో మహిళ మెడలో బంగారు గొలుసు చోరీకి యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేశారు. అన్నపూర్ణ అనే మహిళ ఇంటి ముందు నిల్చొని ఉండగా అటుగా వచ్చిన వ్యక్తి ఆమె మెడలోని గొలుసును లాక్కొని పరుగెత్తాడు. బాధితురాలు కేకలు వేయగా గమనించిన కొందరు యువకులు ఆ దొంగను పట్టుకున్నారు. నిందితుడిది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అని తేలింది. గురువారం యువకులు దొంగను పోలీస్టేషన్లో అప్పగించారు.