ఎర్రుపాలెంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

373చూసినవారు
ఎర్రుపాలెంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఎర్రుపాలెం మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం 74వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు శేగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరియు పార్టీ కార్యదర్శి నారాయణ యాదవ్ తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పిటిసి శీలం కవిత, సర్పంచుల సంఘం అధ్యక్షులు మొగిలి అప్పారావు, ఎం.పి.టి.సి బాబు సాహెబ్, ఎర్రుపాలెం టౌన్ పార్టీ అధ్యక్షులు రాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్