గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

67చూసినవారు
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ఎర్రుపాలెం మండలంలోని మీనవోలు సమీపాన గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ పి. వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం. మధిరకు చెందిన షేక్ షారూఖ్(26) మీనవోలు నుండి మధిరకు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో షారూఖ్ అక్కడక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్