ఎర్రుపాలెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎర్రుపాలెం మండలం మేనువోలు గ్రామం పెట్రోల్ బంకు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. మృతదేహాన్ని 108 ద్వారా మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతి చెందిన వ్యక్తి వద్ద రూ. 56, 400 నగదు ఉండగా, ఆ మొత్తాన్ని ఆసుపత్రిలో గల స్టాఫ్ నర్స్ ఉమాకు అప్పగించినట్లు అంబులెన్స్ ఫైలేట్ మణికుమార్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కృష్ణారెడ్డి తెలిపారు.