‘పుష్ప 2 ది రూల్’లోని స్పెషల్ సాంగ్ కోసం నటి శ్రీలీల ఆడిపాడిన విషయం తెలిసిందే. ‘కిస్ కిస్ కిస్ కిస్సిక్’ అంటూ సాగే ఈ పాటకు యువతలో విశేష ఆదరణ లభించింది. ఈనేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘కిస్సిక్’ ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసింది. అల్లు అర్జున్, శ్రీలీల డ్యాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. సుభ్లాషిణి పాడారు.