ఐపీఎల్ రిటెన్షన్ కు ముందు LSG ఓనర్ గోయెంకాతో KL రాహుల్ సమావేశం

61చూసినవారు
ఐపీఎల్ రిటెన్షన్ కు ముందు LSG ఓనర్ గోయెంకాతో KL రాహుల్ సమావేశం
ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదలకు ముందు కోల్‌కతాలో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకాతో ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ గంటపాటు సమావేశమయ్యారు. వచ్చే ఐపీఎల్ సీజన్ లో LSGలోనే తాను కొనసాగుతానని రాహుల్ చెప్పాడని, అయితే ఈ అంశం పై యాజమాన్యం ఎలాంటి హామీ ఇవ్వలేదని పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. కాగా ఐపీఎల్ మెగా వేలం సమీపిస్తున్నా బీసీసీఐ రిటెన్షన్ పాలసీని ఇంకా ప్రకటించలేదు.

ట్యాగ్స్ :