అటవీ ప్రాంతంలోని రైతులకు ప్రజలకు పులి బెడదా నుండి రక్షణ కల్పించాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు పంట చేతికొచ్చిన సందర్భంలో కూలీలు దొరకక ఇబ్బందులు పడుతున్న సమయంలో పులి భయంతో మరింత నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. తక్షణమే పులి జాడను కనుక్కొని రైతులకు రక్షణ కల్పించాలన్నారు.