జైనూర్ మండలంలోని గ్రామల్లో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను జైనూర్ ఎంపీడీఓ సుధాకర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి 75 అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచాలని సిబ్బందికి ఆదేశించారు. ఏ ఒక్క ఇంటిని కూడా వదలకుండా సర్వే జరపాలని ఆయన సూచించారు.