ఏసీబీ వలకు చిక్కిన జైనూర్ తహసీల్దారు

57చూసినవారు
ఏసీబీ ట్రాప్లో జైనూర్ మండల తహశీల్దారు, పంచాయతి కార్యదర్శి చిక్కారు. శనివారం రూ. 12 వేలు లంచం తీసుకుంటూ తహశీల్దార్‌ దురిశెట్టి తిరుపతితో పాటు, పోచంలొద్ది పంచాయతీ కార్యదర్శి శేఖర్ పట్టబడ్డారు. పోచంలొద్దికి చెందిన కాంట్రాక్టర్ కేంద్రే సుబోధ్ కాంత్ ను రూ. 9 లక్షలు పాస్ చేయటానికి లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేని కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించగా డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో నిందితులు పట్టబడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్