363 జాతీయ రహదారిపై వాంకీడి మండలం గోయేగాం గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇనుప ఖనిజాన్ని తీసుకెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఉదయం 6. గంటల సమయంలో డ్రైవర్ జాతీయా రహదారిపై ఉన్న గుంతను గమనించకుండా వెళ్లడంతో లారీ అదుపుతప్పి రోడ్డులోకి దూసుకొచ్చి బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.