కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి ఉదయం 11గంటలకు జరుపబడునని సోమవారం మీడియా ప్రకటనలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, మహిళ కాంగ్రెస్, తదితరులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.