కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని నవేదరి గ్రామపంచాయతీలోని అర్లి గ్రామంలో గ్రామస్తులను డ్రైనేజీలు పట్టి పీడుస్తున్నాయని గ్రామస్తులు సోమవారం వాపోయారు. నెలలతరబడి డ్రైనేజీలను నిర్లక్ష్యంగా సంబంధించిన పాలక వర్గం వదిలేసిందని, పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడ డ్రైనేజీల్లో చల్లడం లేదని తెలిపారు.