సిర్పూర్ టీ: రైలు ఢీ కొని 170 గొర్రెలు, 10 మేకలు మృతి
కొమరం భీం జిల్లా సిర్పూర్ టీ మండలంలో ఆదివారం రాత్రి వర్షం పడడంతో గొర్రెలు, మేకలు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పైకి వెళ్లగా సడెన్గా వచ్చిన రైలు వాటిని ఢీ కొనడంతో మొత్తం 170 గొర్రెలు, 10 మేకలు మృతి చెందినట్లు గొర్రెల కాపరులు తెలిపారు. అవి జడ భీమయ్య అనే అతనికి సంబందించినవి అని వారు తెలిపారు. వాటిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.