బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసి భవనంలో శుక్రవారం ఆదివాసి సంఘం నాయకుల ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు బీర్సా ముండా 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల సర్మెడి కుడప శంకర్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర సంగ్రామం కోసం అలుపెరుగని పోరాటం చేసి చిన్న వయసులోనే అమరుడైన బీర్సా ముండా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.