ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటిలో చోరీ

58చూసినవారు
కాగజ్‌నగర్‌ మండలం కోసిని గ్రామంలో గల బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం పక్కింటి వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు‌. దొంగలు ఇంటి తాళాలను ఎక్సాబ్లేడ్ తో కోసి లోనికి ప్రవేశించి బీరువా తాళాలు పగుల గొట్టి విలువైన పత్రాలు దొంగిలించినట్లు సమాచారం. ఘటనా స్తలానికి చేరుకున్న పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్