ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం రథచక్రాల నమూనాలను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేశారు. అచ్చం కోణార్క్ చక్రాలను తలపించేలా ఎర్రని ఇసుకరాతితో రూపొందించిన నాలుగు చక్రాలను రాష్ట్రపతి భనవ్ సాంస్కృతిక కేంద్రం, అమృత్ ఉద్యాన్లలో ప్రతిష్ఠించారు. భారతదేశ సమున్నత వారసత్వ వైభవాన్ని సందర్శకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ చక్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.