భారత వైమానిక దళానికి చెందిన మొదటి రవాణా విమానం C-295. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ ఈ తొలి C-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాప్ట్‌ను సెప్టెంబర్ 13న భారత్‌కు అందజేసింది. అత్యవసర పరిస్థితులు నెలకొన్న సమయాల్లో సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. 5-10 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ విమానం 71 ట్రూప్స్‌ను లేదా 50 మంది పారాట్రూపర్‌లను మోసుకెళ్లగలదు.