కాగజ్‌నగర్ మండలంలోని పెద్దవాగు నుంచి మారుతీ నగర్ మీదుగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తుండగా కాలనీవాసులు అడ్డుకున్నారు. డ్రైవర్ల వద్ద ఎటువంటి అనుమతి పత్రాలు లేవని వారి వద్ద కేవలం భట్పల్లి గ్రామం ఆలయ రసీదు ఉండటంతో మండల అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆస్ఐలు సంఘటన స్థలానికి చేరుకుని విచారించి ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు.