కాగజ్ నగర్, ద్వారక నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది. కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం త్వరలో ముగుస్తున్నందున ఎన్నికలు నిర్వహించాలని కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు దాసరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి కొంగ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.