కాగజ్‌నగర్ పట్టణంలోని ఓల్డ్ కాలనీలో గల గురుద్వారాలో మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా సిక్కు మతస్థులు మరియు పంజాబీలు ఏర్పాటు చేసిన లంగర్ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురు నానక్ వారి కృపాకటాక్షాల వలన సిర్పూర్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.