ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే

72చూసినవారు
ఇచ్చిన మాటను సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు నిలబెట్టుకున్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని అశోక్ కాలనీలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా దుర్ఘటనలో మరణించిన మున్సిపల్ బిల్ కలెక్టర్ లింగంపల్లి నాగేష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే ఆదివారం పరామర్శించారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల చెక్కును వారి సతీమణి లక్ష్మికి అందజేయడం జరిగింది. అలాగే ఇన్సూరెన్స్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా మంజూరు చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్