తెలంగాణా వైపు వస్తున్న ఏనుగుల గుంపు భయాందోళనలో గ్రామస్తులు

75చూసినవారు
మహారాష్ట్ర నుండి తెలంగాణాలోని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వైపు భారీ గజరాజుల గుంపు కదులుతోంది. పెంచికల్పేటకు కేవలం 30 కి. మీ. ల దూరంలో, పెద్ద సంఖ్యలో ఏనుగులు సంచరిస్తోన్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ క్రమంలో ఏనుగులు ఎటువంటి భీభత్సం సృష్టిస్తాయోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెంచికల్ పేట్ లో అటవీశాఖ అధికారులు డప్పుల చాటింపు వేయిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్