కాగజ్ నగర్ మండలంలోని వంజరి గ్రామంలో రాత్రి కురిసిన భారీ కుండపోత వర్షానికి నీళ్లు నిల్వ ఉన్నందున వారు బాహ్య ప్రపంచానికి దూరం అయ్యారు. శుక్రవారం ఈ సమస్య తెలుసుకున్న బిఆర్ ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గం కన్వినర్ లేండుగురే శ్యాంరావ్ గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు న్యాయం చేయాలనీ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. లేని యెడల హైవే రోడ్డు పై వచ్చి ధర్నా నిర్వహిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.