డబ్బుల కోసమే బెదిరిస్తున్నారనే నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ వ్యాఖ్యలను లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు రమేశ్ ఖండించారు. ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. "సల్మాన్ గతంలోనే బ్లాంక్ చెక్ బుక్ ఇచ్చి నచ్చినంత రాసుకొని తీసుకోమని చెప్పాడు. డబ్బే కావాలనుకుంటే అపుడే తీసుకునేవాళ్లం. ఆ ఆఫర్ ను తిరస్కరించాం” అని అన్నారు. కృష్ణ జింకలను సల్మాన్ చంపాడనే ఆరోపణల నేపథ్యంలో బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్, సల్మాన్ పై పగబట్టాడు.