దహెగాం: పెద్దవాగు అదనపు వంతెన నిర్మాణానికి భూమి పూజ
దహెగాం మండలం లగ్గామ శివారు, పెంచికల్ పేట్ మండలాలకు మధ్యలో రూ. 18 కోట్ల సీఆర్ఐఎఫ్ నిధులతో మంజూరైన పెద్దవాగుపై అదనపు వంతెన నిర్మాణానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు శనివారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ దహెగాం మండల మరియు పెంచుకల్ పేట్ మండలలా ప్రజలకు అనుసంధానంగా ఉన్న పెద్దవాగు వంతెన అదనపు నిర్మాణం శుభసూచకమని అన్నారు.